ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక దిశా నిర్దేశం..!!

ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పాలనా, పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులను ప్రజలతో మమేకం అయ్యేలా ప్రణాళికలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి..ఇప్పుడు పెట్టుబడులు – ఉపాధి కల్పన పైన ఫోకస్ చేసారు. కొత్త పరిశ్రమలకు వ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. ఏపీలో పెట్టుబడులు – ఉపాధి కల్పన పైన స్పష్టత ఇచ్చారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు.

 

శంకుస్థాపన : ముఖ్యమంత్రి జగన్ కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసారు. వీటి ద్వారా 21,079 మందికి ఉపాధి అందనుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో ఏర్పాటు చేయనున్న 17 ప్రాజెక్టుల్లో గుంటూరు, హిందూపూర్, మచిలీపట్నంలో రూ.670 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో స్టార్చ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, విజయనగరం, కర్నూలులో ఏర్పాటు చేసే ఆర్టీఈ..ఆర్టీసీ ఉత్పత్తుల త­యారీ పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక రంగం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు వెల్లడించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నామని జగన్ చెప్పారు.

 

కొత్త ఉద్యోగాలు : ఆరు లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు నెలకొల్పేలా ప్రతీ నెలా సమీక్ష చేస్తూ పురోగతి కోసం చర్యలు తీసుకున్నామని వివరించారు. 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభించాయని చెప్పుకొచ్చారు. 94 ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని..మరి కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని చెప్పారు. ఈ నాలుగున్నారేళ్ల కాలంలో 130 భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసామన్నారు. 69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. 86 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగామని చెప్పుకొచ్చారు.

 

ఫోన్ కాల్ దూరంలో : ఎంఎస్ఎంఈ సెక్టార్ లో ఎప్పుడూ చూడని అడుగులు వేశామన్నారు. కోవిడ్ సమయంలోనూ వారికి చేయూత ఇచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. 1.88 లక్షల ఎంఎస్ఈలు కొత్తగా వచ్చాయని..12.62 లక్షల ఉద్యోగాలు వీటి ద్వారా వచ్చాయని వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి కేవలం ఫోన్ కాల్ దూరంలో ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.విజయనగరంలో ను­వ్వుల ప్రాసెసింగ్‌ యూ­ని­ట్లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్‌ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్‌ మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో ఏర్పాటు చేసిన సిగాచి ఇండస్ట్రీస్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో ఇథనాల్‌ తయారీ యూనిట్‌లను ప్రారంభించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram