హైదరాబాద్‌కు కాంగ్రెస్ అభ్యర్థులు.. అధిష్టానం అలెర్ట్..

తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని ప్రీపోల్ సర్వేలు స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ హస్తం పార్టీదే హవా అని తేల్చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ ను దాటి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తాయన్న దానిపైనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కూడా అప్రమత్తం అయ్యింది.

 

ఆదివారం తెలంగాణలో 49 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకుల నియమించింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను హైదరాబాద్‌ రప్పించాలని యోచిస్తోంది.

తాజ్‌ కృష్ణలో అభ్యర్థులకు దిశానిర్దేశం చేయాలని ఏఐసీసీ ప్రతినిధులు భావిస్తున్నారు. హైదరాబాద్‌కు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ రానున్నారు. మరోవైపు టీకాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ లో మాట్లాడనున్నారు.

 

ఎన్నికల ఏజెంట్‌కే ఎమ్మెల్యే ధ్రువపత్రం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఈ విషయంపై వికాస్‌రాజ్‌ కు కాంగ్రెస్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే అలాంటి వెసులుబాటు ఏదీ లేదని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారని తెలుస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram