తెలంగాణలో రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక సూచనలు చేశారు. వర్చువల్ సమావేశంలో అయన మాట్లాడుతూ.. ‘ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలు దాటి రావొద్దు. AICC పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలి’ అని రాహుల్ సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ రావాలని పిలిచిన అభ్యర్థులు సైతం రావొద్దని పీసీసీ నేతలు సూచించారు. మరోవైపు ఇవాళ రాత్రి డీకే శివకుమార్ HYD రానున్నారు.









