తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికలో హైడ్రామా..

హైదరాబాద్,: తెలంగాణ ముఖ్యమంత్రి గా దాదాపు రేవంత్ రెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేసేందుకు సిద్దమైంది.కానీ రేవంత్ ను సీఎం గా తాము అంగీకరించలేము అని కొంత మంది సీనియర్ నాయకులు అడ్డుపడుతున్నారు.దీంతో డీకే శివకుమార్ చేసేది ఏమి లేక ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఎమ్మెల్యే ల అభిప్రాయం, సీనియర్ నాయకుల అభ్యంతరాలను సోనియా గాంధీకి, మల్లికార్జున్ ఖర్గేకు వివరించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే నే రాబోయే లోక్ సభ ఎన్నికలల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఢిల్లీ పెద్దలు సీనియర్ లకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి, ,రాజనర్సింహ లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ రోజు ప్రమాణ స్వీకారం జరుగుతుందా?లేదా అనేది టెన్షన్ కు గురిచేస్తుంది.అధిష్ఠానం మాత్రం ఈ రోజు రాత్రికే ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తి అవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram