కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  రేవంత్ రెడ్డికి అధిష్ఠానం చెక్..?

 

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి నే చేస్తారని అందరు భావించారు.అందులో కీలకమైన హోం శాఖ సైతం రేవంత్ రెడ్డి తన అత్యంత నమ్మకమైన వ్యక్తి సీతక్క కు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు.కానీ సీనియర్ లు మాత్రం రేవంత్ రెడ్డికి సీఎం వద్దని అడ్డుకుంటున్నారు.భట్టి విక్రమార్క కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధిష్ఠానం మాత్రం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ని, భట్టి విక్రమార్క లకు అధిష్ఠానం నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ తప్పని సరి పరిస్థతుల్లో రేవంత్ ను చేస్తామంటే భట్టి కి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు డీప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అదే విధంగా కీలకమైన హోం శాఖ మాత్రం రేవంత్ రెడ్డి వర్గమైన సితక్కకు వద్దని సీనియర్లు అధిష్ఠానానికి వివరించారు. సీఎం, హోం శాఖలు రేవంత్ రెడ్డి చేతిలో పెడితే పార్టీకి భవిష్యత్తు లో ప్రమాదం పొంచి ఉంటుదని అధిష్ఠానానికి సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. సీనియర్ ల సలహా,సూచనాలను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన హోం శాఖ మాత్రం అధిష్ఠానానికి లాయల్ గా ఉన్న వ్యక్తికే ఇవ్వాలని నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రేవంత్ రెడ్డికి హై కమాండ్ చెక్ పెట్టినట్లే !

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు