రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయితే వచ్చే ఏడాది సమ్మర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా విశాల్ చంద్ర శేఖరిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే









