కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు కించే శకుంతలకు డాక్టరేట్ ప్రధానం..

 ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు కించే శకుంతలకు డాక్టరేట్ ప్రధానం..

చింతూరు అక్టోబర్ 22 : TODAY 9 ప్రతినిధి…

 చింతూరు  ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయనిక శాస్త్ర విభాగాధిపతి కించే శకుంతల, ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం,స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.కె.రత్న మాణిక్యం  అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ సముద్ర నిల్ పాల్ మార్గనిద్దేశకత్వంలో “సింథసిస్ ఆఫ్ నికెల్(II) అండ్ కాపర్ (II) కాంప్లెక్స్ విత్ N,O అండ్ O,N,O – డోనార్ లైగాండ్స్ అండ్ అండ్ థైర్ కేటాలైటిక్ అప్లికేషన్స్” అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు. ఈ పరిశోధన మూలంగా చవకైనా ఉత్ప్రేరకాలు ఉపయోగించి పర్యావరణ అనుకూలమైన సింథటిక్ మార్గాల ద్వారా బైఎరైల్స్ మరియు క్వినాజోలినోన్స్ వంటి ఔషధాలకు సంబంధించిన ముఖ్యమైన సమ్మేళనాలను అభివృద్ధి చేయడం మరియు క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సవాళను పరిష్కరించడమే కాకుండా రసాయన పరిశోధనలో సుస్థిరమైన పద్ధతులను కూడా ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ కుటుంబం అయినా నా తండ్రి కించే మత్స్యరాజు, తల్లి కించే చిన్న తల్లి దంపతుల కుమార్తెగా తానెంతో గర్వపడుతున్నానని, ఈ పరిశోధనలో తనకు సహకరించిన ప్రొఫెసర్. సముద్రనిల్ పాల్, తన భర్త అద్దంకి సుధాకర్, సోదరి విజయభారతి- డాక్టర్.డాల్ పడాల్ మామయ్య, సోదరుడు కించే రవికుమార్ , కుటుంబ సభ్యులకు తన ఉన్నతికి సహకరించిన అందరికీ  శకుంతల కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు