భద్రాచలం నుండి వెంకటాపురం వెళ్ళే ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపట్టండి… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి సిపిఎం పార్టీ వినతి.

భద్రాచలం నుండి వెంకటాపురం వెళ్ళే ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపట్టండి…

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి సిపిఎం పార్టీ వినతి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 23: టుడే 9 ప్రతినిధి…

భద్రాచలం నుండి వెంకటాపురం వెళ్ళే ప్రధాన రహదారి మొత్తం  ఇసుక లారీల వల్ల గుంతలు ఏర్పడి పూర్తిగా దెబ్బతిన్నదని తక్షణమే ఆ రహదారికి కావలసిన నిధులు మంజూరు చేసి మరమ్మత్తులు చేపట్టాలని సిపిఎం బృందం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి  కోమటిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తక్షణమే తగిన నిధులు మంజూరు చేసి ఆ రోడ్డుకు మరమ్మత్తులు నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్టు సీపీఎం నేతలు తెలియజేశారు. వినతి పత్రం అందించిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, పార్టీ ములుగు జిల్లా సీనియర్ నాయకులు సూడి కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

 

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share