ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘటన.
5 కేజీల బాల భీముడి కి ఆసుపత్రిలో జన్మనిచ్చిన తల్లి.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అక్టోబర్ 23 : టుడే 9 ప్రతినిధి
భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది, మణుగూరు పట్టణానికి చెందిన, జోగునూరు బాబు, అతని భార్య అయిన జోగునూరు రాణికి పురిటి నొప్పులు రావడంతో మణుగూరు ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి గర్భిణీ స్త్రీ అయిన రాణి కి షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు,

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్ట్ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని, వెనువెంటనే ఆపరేషన్ నిర్వహించి పండంటి మగ బిడ్డకు కాన్పు చేశారు, పుట్టిన మగ బిడ్డ బరువు చూసిన హాస్పటల్ సిబ్బంది. కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు పుట్టిన మగ బిడ్డ ఐదు కేజీలు ఉండి బాల భీముడులా ఉండటంతో , కాన్పు చేసిన డాక్టర్ ఆనందం వ్యక్తం చేశారు అనంతరం తల్లి బిడ్డను పరీక్షించిన వైద్యులు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఇలాంటి ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగటం ఎంతో ఆనందంగా ఉందని, పేద ప్రజలందరూ ప్రభుత్వ సేవలు వినియోగించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేపించుకోవాలని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ కోరారు.









