తెలంగాణలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు

తెలంగాణలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు …

రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన 95,436 దరఖాస్తులు…

గతంతో పోలిస్తే భారీగా 37 వేలు తగ్గిన దరఖాస్తుల సంఖ్య .. పెరిగిన 218 కోట్ల ఆదాయం…

హైదరాబాద్..తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులకు గడువు ముగిసేనాటికి 95,436 దరఖాస్తులు దాఖలైనట్లు  ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.గడువు పెంచడంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుండగా..పెంచిన గడువు రద్దు చేస్తూ తీర్పు వస్తుందేమోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

కాగా గతేడాది 1.32 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి భారీగా 37 వేలు తగ్గిపోయిన దరఖాస్తుల సంఖ్య దరఖాస్తుల సంఖ్య తగ్గినా, టెండర్ ధర రూ.3 లక్షలు చేయడంతో,ప్రభుత్వం గతంలో కంటే స్వల్పంగా ఎక్కువ ఆదాయం రాబట్టింది.ఇది ఇలా ఉండగా, అక్టోబర్ 18వ తేదీన ముగియాల్సిన దరఖాస్తుల గడువును, ఆశించిన మేరకు ఆదాయం రాలేదని అక్టోబర్ 23వ తేదీ వరకు  ఎక్సైజ్ శాఖ పొడిగించటం గమనార్హం. అయితే గడువు పెంచడం చట్ట విరుద్ధమని దాఖలైన పిటిషన్ పట్ల హైకోర్టు నేడు విచారణ జరపనుంది..

ఇప్పటివరకు దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపిన అధికారులు. ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆరురోజులు గడువు పొడిగించింది. అయితే దరఖాస్తు గడువు పెంచినా ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో  అధికారులునిరాశ చెందుతున్నారు .

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share