కర్నూలులో ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి

కర్నూలులో ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి…

పూర్తిగా మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

బస్సులో చిక్కుకున్న 25 మందికిపైగా ప్రయాణికులు..బస్సు కింద చిక్కుకున్న మరో ద్విచక్ర వాహనం…

కర్నూలు జిల్లా చిన్నటేకూరులో కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 25 మందికి పైగా దుర్మరణం చెందినట్లు సమాచారం అందుతోంది. బస్సు పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలో. అగ్నిప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు. బస్సును బైక్‌ ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుంచి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు..

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై పూర్తిగా మంటల్లో దగ్ధమైన బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(DD 01 AN 9190) ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్లు, 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు స్థానికుల నుంచి సమాచారం అందుతోంది.

కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది.నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్(8), కూతురు మన్విత(6) మృతి చెందినట్టు సమాచారం. బెంగళూరులో స్థిరపడ్డ రమేష్ కుటుంబం.. హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదంలో మృతి చెందటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది..

బస్సు ప్రమాదం పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి…

హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న ప్రైవేటు బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రమాదంలో పలువురు మృతి చెందారన్న వార్త తీవ్రంగా కలచివేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని… వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి, సహాయక చర్యలను సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం, ఇతర సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన అందించాలని అధికార్లను ఆదేశించారు. తక్షణం ఘటన స్థలానికి వెళ్లి, సహాయక చర్యలను పర్యవేక్షించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్, ఎస్పీలను  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

బస్సు ప్రమాద ఘటనలో బయటపడుతున్న సంచలన విషయాలు….

కర్నూలులో అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై బయటపడుతున్న సంచలన విషయాలు

ఈ ఏడాది మార్చి 31వ తేదీతో బస్సు ఫిట్ నెస్ వాలిడిటీ, గతేడాది ఏప్రిల్ నెలలో  ఇన్సూరెన్స్, పొల్యూషన్ వాలిడిటీ ముగిసినట్టు తెలుస్తోంది. కాగా పటాన్ చెరులో నిన్న రాత్రి 9.30 మధ్య బయలుదేరి, హైదరాబాద్ లోని అనేక స్టాపుల్లో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు బయలుదేరినట్టు తెలుస్తోంది..

Facebook
WhatsApp
Twitter
Telegram