కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  డ్రైను నిర్మాణానికి నిధులు కేటాయించాలి….. CPM

ఏ.ఎం.సీ కాలనీ శివారులో ఉన్న డ్రైను నిర్మాణానికి నిధులు కేటాయించాలి….. CPM

♦ ద్వారకా నగర్ లోని ఇళ్లు డ్రైనేజీ నీటితో ముంపుకు గురవుతున్నా పట్టించుకోరా..?

♦  పేదల నివాస ప్రాంతాల పట్ల గ్రామపంచాయతీ అధికారులు వివక్షత వీడాలి….. సీపీఎం నేతలు…

♦  ఏఎంసీ కాలనీలో సీపిఎం నాయకులు పాదయాత్ర….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 26 : టుడే 9 ప్రతినిధి

పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పై గ్రామపంచాయతీకి సమగ్రమైన ప్రాణాళిక లేదని, సమగ్ర ప్రణాళిక రూపొందించాలని,పేదలు నివసించే కాలనీల పట్ల గ్రామపంచాయతీ అధికారులు నిధులు కేటాయించకుండా వివక్షత చూపుతున్నారని సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి విమర్శించారు. సిపిఎం పార్టీ మాస్ లైన్ కార్యక్రమంలో భాగంగా సమస్యలపై అధ్యయనం చేస్తూ నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా అనేక సమస్యలను ప్రజలు పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.13 వ వార్డులోని ద్వారకా నగర్ లోని ఎమ్మెల్యే గారి ఇంటి వెనుక వీధిలో చిన్న వర్షానికే డ్రైనేజీ పొంగి ఇండ్లు ముంపుకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పాదయాత్ర బృందానికి బాధితులు తెలిపారని,కుర్రాజులగుట్ట పాల కేంద్రంలో ఉన్న పురాతన వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూడుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని చుట్టూ నివాసం ఉంటున్న ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని అన్నారు. ఏఎంసీ కాలనీ శివారులో ప్రమాదకరంగా ఉన్న డ్రైను నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదల నివాసం ఉంటున్న ప్రాంతాలకు గ్రామపంచాయతీ నుండి నిధులు కేటాయించడంలో వివక్షత చూపుతున్నారని ఇది సరైనది కాదని అన్నారు.

గ్రామపంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ పట్ల సమగ్రమైన ప్రణాళిక అధికారులకు లేదని, తక్షణమే సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. 13వ వార్డు పరిధిలో కొనసాగిన పాదయాత్రలో జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు, పి సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు కుంజా శ్రీనివాస్ ఉస్తేలా జ్యోతి, కోరాడ శ్రీనివాస్, జీవనజ్యోతి,అజయ్ కుమార్,కనకశ్రీ, శాఖ కార్యదర్శులు కాపుల దుర్గారావు,కాకా రమణ, జి. నాగలక్ష్మి, సీత, గోవర్ధన ఝాన్సీ, గిరిజన సంఘం నాయకులు కుంజా విజయ సోయం జోగారావు, సున్నం ప్రవీణ్, ఐద్వా నాయకులు వై పూర్ణిమ, గౌతమి, సిహెచ్ వెంకటరమణ, రమాదేవి,అల్లాడ సత్యవతి,సీత, డివైఎఫ్ఐ నాయకులు డి. సతీష్ కుమార్,ఎస్ఎఫ్ఐ నాయకులు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు