గోదావరి కరకట్టను శుభ్రంగా ఉండేలా చూడాలి….
ఐటిడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్.సబ్ కలెక్టర్ మృనాళ్ శ్రేష్ట….
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 27: టుడే 9 ప్రతినిధి
దక్షిణ అయోధ్యగా బాసిల్లే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి వివిధ రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, దైవ దర్శనానికి ముందు పావన గోదావరి నదిలో కుటుంబ సభ్యులతో కలిసి స్నానంచేసి దేవుని దర్శించుకుంటారని, అందుకు అనుగుణంగా గోదావరి కరకట్ట ప్రదేశాలన్నీ శుభ్రంగా ఉండేలా చూడవలసిన బాధ్యత అధికారులు స్వచ్ఛంద సంస్థలపై ఉన్నందున అందరూ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

సోమవారం నాడు గోదావరి కరకట్ట ప్రాంతం ప్రదేశాలలో సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, రెవెన్యూ, గ్రామపంచాయతీ సిబ్బంది ,స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో చేపట్టిన ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్లాస్టిక్ వ్యర్ధాలను, తడి చెత్త, పొడి చెత్తను సేకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు గోదావరిలో స్నానం ఆచరించిన తరువాత ప్లాస్టిక్ సంచులు,ఇతర వ్యర్థపదార్థాలను,కరకట్ట దగ్గర వేయకూడదని సూచించారు,గతంలో భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలు చెత్తను ఇష్టం వచ్చినట్టుగా కరకట్ట ప్రదేశాలలో పడవేయడం వలన మంటలు చెలరేగి పరిసర ప్రాంతాలలో పొగలు కమ్ము కోవడంతో భక్తులు శ్వాస పీల్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడినందున కరకట్ట ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు, తడి చెత్త,పొడి చెత్తను ఎవరూ కరకట్ట ప్రదేశాలలో వేయకుండా గ్రామపంచాయతీ సిబ్బందిని కాపలా ఉంచాలని ఈవోను ఆదేశించారు, భద్రాచలం పట్టణంలోని వార్డులలో సేకరించిన చెత్తను కొత్తగా నిర్మాణం చేపట్టిన డంపింగ్ యార్డ్ లోనే వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరకట్ట పక్కన చెత్తను పడేయడం వలన దోమలు ప్రబలి భద్రాచలం ప్రజలు వివిధ రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని, అందుకు ప్రజలు కూడా గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించి తడి చెత్త పొడి చెత్త వేరు,వేరుగా మీ వద్దకు వచ్చే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లో మాత్రమే వేయాలని, ఎక్కడపడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు పడవేయకూడదని అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది తప్పనిసరిగా ప్రతి వార్డు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించాలని అన్నారు. భద్రాచలం పట్టణ ప్రజలు భక్తులు ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించే దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై భద్రాచలం పట్టణాన్ని పచ్చదనం పరిశుభ్రత వెల్లివిరిసేలా చేసి, సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ చైతన్య,భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్, గ్రామపంచాయతీ ఇఓ శ్రీనివాస్, డిగ్రీ కళాశాల విద్యార్థులు,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









