కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రోడ్లన్నీ అస్తవ్యస్తం.. బీ ఆర్ ఎస్ పార్టీ

కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రోడ్లన్నీ అస్తవ్యస్తం…

♦ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా పట్టించుకోనే నాధుడే లేరంటూ మండిపడ్డ భద్రాద్రి బి ఆర్ ఎస్ నేతలు…

♦ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ వర్గం సంతోషంగా లేరన్న బీ ఆర్ ఎస్ నేతలు..

♦ నియోజకవర్గ సమస్యలపై టిఆర్ఎస్ పార్టీ ధర్నా .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 27: టుడే 9 ప్రతినిధి.

భారత రాష్ట్ర సమితి జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు. భద్రాచలం
మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రహదారి తక్షణమే బాగు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ సెంటర్ లో బి ఆర్ ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లొ నియోజకవర్గ పార్టీ నాయకులు మానే రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రోడ్లన్నీ విధ్వంసం పాలయ్యాయని, అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ వర్గము సంతోషంగా లేదని అన్నారు. నియోజవర్గంలో ఇసుక దోపిడీతో రోడ్లన్నీ పాడైపోయి ప్రజలు నరకయాతన అనుభవిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీనా మేసాలు లెక్కిస్తుందని అన్నారు, భద్రాచలం పట్టణంలో అసంపూర్తిగా అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని స్థానిక ఐటిడీఏ పి ఓ నిరంతరం వెళ్లే ప్రధాన రహదారి కూడా గుంటల మయం అయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కనీసం పట్టింపు లేకుండా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి శూన్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ్ కుమార్, కోలా రాజు,బత్తులనరసింహులు, అయినాల రామకృష్ణ, బాసిపోయిన మోహన్ రావు,అంబటి కర్ర కృష్ణ, పార్టీ నాయకులు కుందూరి అప్పారావు,కాపుల సూరిబాబు,పసుపులేటి రమేష్, ఇమంది నాగేశ్వరరావు, జక్కం గోపి,కొల్లిపాక శివ,ఆకోజు పృద్వి,తాండ్ర ప్రసాద్, sk అబ్దుల్ ఖాదర్,చిట్టిమల్ల అనిల్ కుమార్,కల్లూరి శ్రీరాములు,మహిళా నాయకురాలు కావూరి సీతామహాలక్ష్మి,పూజల లక్ష్మి, ప్రియాంక, రవికుమారి కామేశ్వరి,సలోమి,తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు