మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని, యువతను నాశనం చేస్తోంది…

మాదకద్రవ్యాలవినియోగంసమాజాన్ని, యువతను నాశనం చేస్తోంది…

♦ మాదక దవ్యాల వినియోగం.దుష్ఫలితాలపై విద్యార్థినులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ఏ పద్మావతి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 28:  టుడే 9 ప్రతినిధి

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ఏర్పాటు చేస్తున్న అవగాహణ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత .లేనినా ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థినులకు మంగళవారం మాదక ద్రవ్యాల వినియోగం, వాటి వలన కలిగే దుష్ఫలితాలు గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఏ.పద్మావతి మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని, ముఖ్యంగా యువతను నాశనం చేస్తోందని తెలియజేశారు. అందరిభాగస్వామ్యంతోనే మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించగలమని, ప్రతి ఒక్కరు చైతన్యవంతులై, ఈ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


అలాగే స్త్రీ,శిశు,దివ్యాంగుల,వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ నరేష్ మాదకద్రవ్యాల వలన కలిగే శారీరక,మానసిక,సామాజిక ప్రభావాలను తెలియచేశారు. డి.హెచ్.ఈ.డబ్ల్యూ. కోఆర్డినేటర్ రూప మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా,విక్రయం,వినియోగం జరిగితే వెంటనే డయల్ 100, 14446, 1908 నంబర్లకు సమాచారం ఇవ్వాలని, ఎన్,డి.పి.ఎస్ చట్టం గురించి వివరించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలనిర్మూలనగురించి స్లోగన్ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్,ప్రతిజ్ఞ నిర్వహించి ప్రథమ,ద్వితీయ స్థానంలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఎడ్యుకేటర్ రవి,అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram