కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  వికలాంగుడిని మానసికంగా వేధిస్తున్న వారిపైచర్యలు తీసుకోండి.

వికలాంగుడిని మానసికంగా వేధిస్తున్న వారిపైచర్యలు తీసుకోండి.

గ్రామపంచాయతీ ఈవో కి వినతి పత్రాన్ని అందించిన వివిధ వర్గాలు…

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం: అక్టోబర్ 28: టుడే 9 ప్రతినిధి

భద్రాచలం పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న పూల వ్యాపారంచేస్తూ జీవించే,వికలాంగుడైనగోరంట్ల సూర్యనారాయణపై కొందరు వ్యక్తులు  అకారణంగా,అమానుషంగా,వేధిస్తూ,ఇబ్బందులకు గురిచేస్తున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా గ్రామపంచాయతీ చేస్తున్న సూచనలను పాటించకుండా,అక్రమంగా షాపులను  నిర్వహించుకుంటున్నారని,ఇదేమని అడిగినందుకు వేధింపులకు గురి చేస్తున్నారని అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ భద్రాచలం గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసరావును కలిసి భద్రాద్రి ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ సొసైటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ సొసైటీ సెక్రెటరీ అన్నం సత్తిబాబు, అధ్యక్షులు ఊటుకూరి సాయిరాం, ఆటో యూనియన్ జేఏసీ అధ్యక్షులు మరమం శంకర్, మాజీ ఎమ్మార్పీఎస్ నాయకులు, అలవల రాజా ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మేకల లత,పూల వర్తక సంఘం అధ్యక్షులు కరెడ్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ,వికలాంగుడనే కనికరం లేకుండా కావాలనే కాలేజీ గ్రౌండ్ ముందు గ్రామపంచాయతీ అధికారుల సూచనలు ధిక్కరిస్తూ అదనంగా షాపులను ఏర్పాటు చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకొని న్యాయం చేయాలని గ్రామపంచాయతీ ఈవోని కోరారు. వికలాంగులకు ఉన్న హక్కులను సక్రమంగా అమలు చేయాలని, వికలాంగుల ఉపాధి అవకాశాలను ఆటంక పరచకుండా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సొసైటీ నాయకులు ఉజ్జగిరి చైతన్య, నంబూరి లక్ష్మీనారాయణ, పిలక రెడ్డి, పూల వర్తక సంఘం నాయకులు శేఖర్, ప్రభు, కామేశ్వరరావు,రంగారావు,ఖలీల్,రమాదేవి, నాగేశ్వరరావు,రంజిత్ కుమార్,సత్యనారాయణ, ఉమామహేశ్వరి,కస్తూరి,ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు