వరద నష్ట పరిహారంగా  ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10,000 ఇవ్వాలి.

వరద నష్ట పరిహారంగా  ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10,000 ఇవ్వాలి.

చినార్కూర్ లో అంగన్వాడి కొత్త భవనం మంజూరు చేయాలని సబ్ కలెక్టర్ కి వినతి.

ప్రజలందరూ ఈ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించినసబ్ కలెక్టర్ శుభం నొక్వాల్.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం అక్టోబర్ 28
టుడే 9 ప్రతినిధి

మొంథా తుఫాన్ పరిశీలన నిమిత్తం కూనవరం మండల పర్యటనలో భాగంగా చినార్కూర్ వచ్చిన సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ను ఆదివాసీ,కూటమి నాయకుల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ని కలిసి వరదల కారణం గా 5 నెలలుగా వ్యవసాయ పనులు కూలీ పనులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. నిత్యావసర సరుకులు కొనుక్కోవాడానికి డబ్బుకు లేక దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉన్నారని వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి నిత్యవసర సరుకులు అదేవిధంగా 25 కేజీల బియ్యం ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు తక్షణ సహాయంగా ఇవ్వాలని, నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సబ్ కలెక్టర్  కోరారు.

అదేవిధంగా చిన్నారుకుర్ గ్రామంలో 40సంవత్సరాల క్రితం నిర్మించిన అంగన్వాడి కేంద్రం శిధిలావస్థలో ఉందని కొన్ని సంవత్సరాలుగా ఈ విషయాన్ని ఐటిడిఏలో పిర్యాదు చేయడం జరిగిందని. పిఓకు ప్రత్యక్షంగా ఆ అంగన్వాడి కేంద్రాన్ని చూపించామని సబ్ కలెక్టర్కు తెలిపామని, సందర్భంగా ఐటీడీఏ పిఓ స్పందిస్తూ ఈ భవనానికి తక్షణమే నిధులు కేటాయించి నెల రోజుల్లో నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారని సబ్ కలెక్టర్కు తెలియజేశారు.కాగా భవన నిర్మాణాన్ని ఇప్పటివరకు మరమ్మత్తులు చేయలేదని, కొత్త భవనాన్ని ఇంతవరకు  మొదలు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు,పిల్లల తల్లి,దండ్రులు, బాలింతలు సబ్ కలెక్టర్ తో మాట్లాడుతూ స్పష్టమైన హామీని ఇవ్వాలని పట్టుబట్టారు.

సబ్ కలెక్టర్ తనను కలిసిన  వారితో మాట్లాడుతూ ముందుగా మండల ప్రజలందరూ ఈ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులందరూ ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలను పరిశీలించాలని సూచించారు,అలాగే వరదసహాయం నెలరోజుల్లో అందే విధంగా కృషి చేస్తానని,ఈ వరద ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూస్తున్నానని అన్నారు. అదేవిధంగా నష్టపోయిన పంటకు కూడా పరిహారం అదేవిధంగా చూసే క్రమంలో భాగంగా ప్రభుత్వం,కలెక్టర్ తో మాట్లాడాలని,త్వరలోనే పరిహారం కూడా అందుతుందని హామీ ఇచ్చారు, అదేవిధంగా అంగన్వాడి కేంద్రాన్ని వెంటనే పరిశీలించి నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులతో పిఓ మాట్లాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెసా కార్యదర్శి కుంజా అనిల్,అధ్యక్షులు సోడే ముత్తయ్య,పెసా కార్యదర్శి బొడ్డు రమేష్, అధ్యక్షులు కారం.దారయ్య, కూటమి పార్టీల నాయకులు ఎడవల్లి భాస్కరరావు, పాయం వెంకయ్య, చెలికాని ఉమామహేశ్వరరావు, కుంజా.విజయ్, శ్యామల లింగారావు, సోడే రామకృష్ణ,ఐటీడీఏ పిఓ తో పాల్గొన్న అధికారులు స్థానిక ఎమ్మార్వో శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాధ రావు, అగ్రికల్చర్ ఆఫీసర్ దేవి, సబ్ ఇన్స్పెక్టర్ లతా శ్రీ, చిన్నార్కూర్ పంచాయితీ సచివాలయ సిబ్బంది, కార్యదర్శి రోజా, వీఆర్వో ధర్మరాజు, డి ఎ వెంకటేష్, అగ్రికల్చర్ అసిస్టెంట్ లక్ష్మణ్, సర్వేయర్ జోగయ్య వివిధ శాఖల, ఐసిడిఎస్, వెలుగు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram