రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి.
షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం వెంటనే చేయాలి.
గొ బ్యాక్ నాన్ ట్రైబల్ టీచర్స్…ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ డిమాండ్….
చింతూరు నవంబర్ 12: టుడే 9 ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో డివిజన్ ఛైర్మెన్, జల్లి నరేష్ నేతృత్వంలో ఆదివాసి సత్యాగ్రహ యాత్ర 4 వ రోజు ఎటపాక,చింతూరు మండలంలో కొన సాగింది.
ఈ సందర్భంగా ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర రధసారధి రామారావు దొర మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పైగా అయినా, మెగా డి ఎస్ సిని ఆదివాసీలబిదగా డి ఎస్ సి చేశారని విమర్శించారు. మరల 2026 జనవరిలో మరో డి ఎస్ సి అంటున్నారని, ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చిన హామి ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ మాటను ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అడుగుతున్ననన్నారు. జి ఓ 3 పునరుద్దరణ హామి,ముంపు మండలాల రంపచోడవరం జిల్లా ఏమైంది? అని ప్రశ్నించారు. 5 వేల ఆదివాసీ యువత పొట్ట కొట్టారని, ఆ ఉసురు ఊరికే పోదు అంటూ ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. కాగా ఆ ఆవేదనతోనే ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర ను చేపట్టినట్టు తెలియజేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఎ సి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టామని,ఈయాత్ర చింతూరు నుండి శ్రీకాకుళం, సీతంపేట చేరే లోపు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని, రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్న దొర జిల్లా ఏర్పాటు చేయాలని, మెగా డి ఎస్ సీ లో ఏజెన్సీకి వచ్చిన నాన్ ట్రైబల్ టీచర్స్ ని వెనక్కి పంపి, స్థానిక ఆదివాసీలతో భర్తీ చేయాలని, అలాగే పోలవరం ముంపు నిర్వాసిత కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.4 వ రోజు ఎటపాక మండలంలో మేడవాయి, రాజుపేట, దమ్మక్క గుండెం, ఎర్రబోరు, కొత్తూరునారాయణపురం, గోళ్ళగట్ట, కొండిపల్లి, పాండురంగాపురం నుండి చింతూరు మండలం సూరకుంట, అల్లిగూడెం, నర్సింగపేట, మల్లంపేట, నరకొండ, పేగ, వంకగూడెం మొదలగు గ్రామాలలో యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో, సీనియర్ నాయకులు చిచ్చడి శ్రీరామ్ మూర్తి, ఎటపాక జెడ్ పి టి సి ఉబ్బ సుస్మిత, ఎంపీపీ, కోడె కామేశ్వరి, మేడవాయి సర్పంచి కారం వెంకీశ్వర్లు, పేగా సర్పంచి, పాయం చంద్రయ్య, తదితరులను కలిసి మద్దతును కోరారు. ఈ కార్యక్రమంలో ఎ పి ఎ జె ఎ సి కేంద్ర కమిటీ సభ్యుడు మడివి నెహ్రూ, పాడేరు నుండి పాంగి అంజిరావు, కిరసాని కిషోర్, చింతూరు మండల ఛైర్మెన్ పొడియం రామకృష్ణ, కాక సీతారామయ్య, మడివి రాజు, పద్దం అర్జున్, పద్దం వంశీ, తోడం చంద్రయ్య, తోడం చిన భద్రయ్య, సోడె శ్రీను, గోరం రాఘవయ్య, తదితరులు పాల్గొన్నారు.









