పాల్గొన్న బిజెపి ఎస్టీ సెల్ అధ్యక్షుడు. రవి నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక నవంబర్ 22: టుడే 9 ప్రతినిధి
భగవాన్ బిర్సా ముండా 150 వ జయంతి వేడుకలలో పాల్గొనేందుకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు నేనావత్ రవి నాయక్ ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని, భగవాన్ బిర్సా ముండా జయంతి కార్యక్రమం విజయవంతం కావాలని అభిలషించారు. అనంతరం బూర్గంపాడు మండలం, సారపాక తాళ్లగొమ్మూరులోని సత్యనారాయణ స్వామి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రవి నాయక్ మాట్లాడుతూ,
భగవాన్ బిర్సా ముండా ఆదివాసీ గౌరవం, భూమి హక్కుల కోసం చేసిన ‘ఉల్గుళాన్’ ఉద్యమం భారత చరిత్రలో మైలురాయి. ‘ధరతి అబా’గా నిలిచిన ఆయన జీవితం, త్యాగాలు దేశవ్యాప్తంగా ఆదివాసీ సమాజానికి ప్రేరణ. బిర్సా ముండా పేరుతో బీజేపీ ప్రభుత్వం అనేక గిరిజన సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది, అని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా భద్రాచలం, పినపాక ప్రాంతాల ఆదివాసీ నాయకులను ప్రత్యేకంగా సన్మానించారు. వక్తలు బిర్సా ముండా పోరాట స్ఫూర్తి, ఆదివాసీ హక్కుల రక్షణ, భూమి సంరక్షణ ఉద్యమాల ప్రాధాన్యతను వివరించారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రంగా కిరణ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మా, జిల్లా నాయకులు బిక్షపతి, బీజేపీ రాష్ట్ర సభ్యులు పోడియం బాలరాజు, బీజేపీ తెలంగాణ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుంజా సంతోష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిలాల్, రాష్ట్ర ప్రతినిధి భాస్కర్, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ విశాల్ నాయక్, ఎనుగుల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









