మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలంటూ.బస్టాండ్ సెంటర్లో నిరసన నిర్వహించిన అఖిలపక్షం
కొత్తగూడెం జిల్లా నవంబర్ 22 :టుడే 9 ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరిసీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ముమ్మాటికీ భూటకమని సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరీ మధు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ముద్ద భిక్షం,సిపిఎం పట్టణ కార్యదర్శి లిక్కీ బాలరాజు, టి జె యస్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం, పౌర హక్కుల సంఘం( సి ఎల్ సి) జిల్లా అధ్యక్షుడు ఎస్ ఉపేందర్ రావు, టి పి ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ ఏఐటిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సూర్నపాక నాగేశ్వర్ రావు,పొ్వ్ జిల్లా అధ్యక్షులు ఆదిలక్ష్మి,ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి లు అన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్షం ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది అనంతరం వక్తలు మాట్లాడుతూ, గుత్త పెట్టుబడి దారులు, సామ్రాజ్యవాదుల కోసం భారత సైన్యంచే దేశ పౌరులనే వెంటాడటం అప్రజాస్వామ్య చర్య,రాజ్యాంగ ఉల్లంఘనగా అభివర్ణించారు. మోడీ -అమిత్ షా లు అదాని,అంబానీ లకోసం మధ్య భారతం లోని ఖనిజలకోసం నక్సలైట్ల ఏరివేత పేరిట రక్తపు టేరులుపారిస్తున్నారని విమర్శించారు. ఆదివాసులను ఆడవుల్లో నుండి వెళ్ల గొట్టేందుకు కుట్ర తో మానవ హనన లక్ష్యంగా మారణకాండ సాగిస్తున్నారన్నారు. ప్రజలు,బుద్దిజీవులు,హక్కుల సంఘాలు ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని ,మావోయిస్టు పార్టీ తో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు .మోడీ-అమిత్ షా శాంతి చర్చల ప్రక్రియకు నిరాకరించడం అంటేనే వీరు సామ్రాజ్య వాద పెట్టుబడిదారుల కు ఏజెంట్స్ మారారని స్పష్టం అవుతుందని వ్యాఖ్యానించారు. మారేడుమిల్లి అడవులో బూటకపు ఎన్కౌంటర్ లో అమరులైన కామ్రేడ్స్ మాడవి హిడ్మా, హేమ, రాజే, మరో నలుగురి మృతి పై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.అమరులకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నామన్నారు. భారతదేశ పౌరులైన మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఆపరేషన్ నిలిపివేయాలని నూతన అటవీ సంరక్షణ నియమాలు 2022 రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్షం మరియు ప్రజాసంఘాల నాయకులు గౌని నాగేశ్వర్ రావు జాటోత్ కృష్ణ తుపాకుల నాగేశ్వరరావు కల్తీ వెంకటేశ్వర్లు యన్ సంజీవ్ రేపాకుల శ్రీనివాస్ వల్లోజు రమేష్ భూక్యా రమేష్ యాస నరేష్ కలంగి హరికృష్ణ గోపి శ్రీనివాస్ వెంకటేశ్వర్లు దేవదానం తులసిరాం తదితరులు పాల్గొన్నారు.









