పైల్స్ ఆపరేషన్ వికటించి బాలుడి మృతి…

హైదరాబాద్ TODAY 9….పైల్స్ ఆపరేషన్ వికటించి బాలుడు మృతిచెందిన విషాద సంఘటన నెలకొంది.

హయత్‌నగర్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పైల్స్ సమస్యతో ‘సైదా పైల్స్ క్లినిక్’లో ఓ 17 ఏళ్ల బాలుడు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పైల్స్ ఆపరేషన్ వికటించి.. అతడు మరణించాడు. దీంతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. నకిలీ డాక్టర్లు ఇలాంటి క్లినిక్‌లు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram