గోదావరి కళ్యాణ కట్ట వద్ద గుర్తుతెలియని శవం.

భద్రాచలం నవంబర్ 23 :టుడే 9 ప్రతినిధి

భద్రాచలం గోదావరి నది కరకట్ట ప్రాంతంలో గల కళ్యాణకట్ట క్రింద మెట్ల భాగాన ఒక గుర్తుతెలియని మగ శవం ఉన్నట్టు, స్థానికులు భక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గుర్తించినారు. కాగా మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి సుమారు 65 నుండి 70 సంవత్సరములు మధ్య వయస్సు ఉండి తెల్లని జట్టు గడ్డంతో బక్క పలుచగా ఉన్నాడని పోలీసులు తెలియజేశారు. మరణించిన వృద్ధుడు పింక్ కలర్ షర్టు, బ్లాక్ రెడ్ వైట్ పట్టీలు గల నల్లని దుప్పటి కప్పుకొని కళ్యాణకట్ట క్రింద భాగాన గల మెట్ల వద్ద ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా శవం ప్రక్కన ఎటువంటి ఆధారాలు లేవని,చుట్టుప్రక్కల వారిని విచారించగా ఈ వ్యక్తి గత కొంతకాలంగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో, గోదావరి నది తీరాన భక్తులు, షాపుల వద్ద భిక్షాటన చేసుకుంటూ కాలము గడుపుతున్నాడని తెలుస్తోంది. శీతాకాలంలో అతనికి సరైన దుస్తులు ఆహారం లేనందున చనిపోయి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతదేహాన్ని భద్రాచలం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి లో మార్చురీలో భద్రపరిచినట్టు తెలియజేశారు. మృతిచెందిన వృద్ధుని వివరాలు తెలిసినవారు వీలైనంత త్వరగా భద్రాచలం పోలీస్ స్టేషన్, భద్రాచలం పంచాయతీ కార్యాలయంలో వివరాలు తెలియపరచాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share