భద్రాచలం గ్రామపంచాయతీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి…

•ప్రజాస్వామ్య పరిరక్షణకై భద్రాచలానికి చెందిన సామాజికవేత్త పూనెం ప్రదీప్ కుమార్ ….పిలుపు..

రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలై, వివిధ రాజకీయ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతూ, అభ్యర్థులను సిద్ధం చేసి చక చకా నామినేషన్లు దాఖలు చేస్తున్న తరుణంలో భద్రాచలానికి చెందిన సామాజికవేత్త పూనెం ప్రదీప్ కుమార్ తనదైన తరహాలో ఓటర్లను జాగృతం చేసేందుకు ముందుకు కదిలారు. అనేక రకాలుగా నష్టపోయిన భద్రాచలం పట్టణం నేడు మరోసారి పైరవీకారుల చేతుల్లో, రాజకీయ నాయకుల కబంధహస్తాలలో నలిగిపోయేందుకు ఓటర్లు అవకాశం ఇవ్వవద్దని మనవి చేస్తున్నానన్నారు భద్రాచలానికి చెందిన సామాజికవేత్త పూనెం ప్రదీప్ కుమార్.. పనిచేసే వ్యక్తి సర్పంచ్ కావాలో, పైరవీకారులు సర్పంచ్ అవ్వాలో ఒకసారి మీరే ఆలోచించుకోండి అంటూ భద్రాద్రి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు.. ఓటు ద్వారా గెలిచే నాయకుడు ఆ ప్రాంత భవిష్యత్తును మార్చే విధంగా ఉండాలని. తన భవిష్యత్తును మార్చుకొని, తన ఆర్థిక అభివృద్ధి సాధించుకునేందుకు ఓటు వేయకూడదని సూచించారు.. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో పవిత్రమైనదని, హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎంత పవిత్రమైనదో భారతదేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు కూడా అంతే పవిత్రమైనదని అభిప్రాయపడ్డారు.. దయచేసి ఓటును నోటుకు అమ్మకోవద్దని .. మన ప్రాంత, మన పిల్లల భవిష్యత్తును నోట్ల కోసం బలి చేయకండని ఓటర్లకు సూచనలు ఇచ్చారు.. ఓటు ఎంత విలువైనదో మనం ఎన్నుకునే నాయకుడు కూడా అంతే విలువలు పాటించేవాడుగా ఉండాలన్నారు. అది ఎవరైనా సరే… అభివృద్ధి చేసే వ్యక్తికే ఓటు వేయాలని అన్నారు .. మంచి వ్యక్తులను, ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకులను ఈ పంచాయతీ ఎన్నికలలో ఎన్నుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలి అంటూ ప్రదీప్ కుమార్ అభ్యర్థించారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share