తాను నక్సలైట్ గా ఉన్నప్పుడు చేసిన హత్య ఇప్పుడు అతని ప్రాణాలపైకే తెచ్చింది. ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ అతని తలరాతను మార్చేసింది.
తాను నక్సలైట్ గా ఉన్నప్పుడు చేసిన హత్య ఇప్పుడు అతని ప్రాణాలపైకే తెచ్చింది. ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ అతని తలరాతను మార్చేసింది. వివరాల్లోకి వెళితే, వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టలో బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య(58) అనే బి ఆర్ ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. 46 ఏళ్ల క్రితం(1979లో) అజ్ఞాతంలో ఉన్న సమయంలో పీపుల్స్ వార్ పెద్దల ఆదేశాల మేరకు, పెద్దన్న అనే వ్యక్తిని హత్య చేసినట్టు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. నక్సలైట్ నరసయ్య ఇచ్చిన ఇంటర్వ్యూ అతడి ప్రాణాలు తీసింది. ఈ ఇంటర్వ్యూ చూసిన అప్పట్లో సిద్దయ్య చేతిలో హత్యకు గురైన పెద్దన్న కొడుకు సంతోష్.. నర్సయ్యపై పగ పెంచుకున్నాడు. తన తండ్రిని చంపిన నర్సయ్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో నరసయ్యకు అభిమానిగా చెప్పుకొని దగ్గరైన సంతోష్ నరసయ్యను రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని గుట్టలకు పిలిపించి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.









