సుపరిపాలన కోసమే స్థానిక ఎన్నికలలో కూటమి ఏర్పాటు…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నవంబర్ 28
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం గ్రామపంచాయతీకి పాలకవర్గం లేక అధికారుల హయాంలో అవినీతి రాజమేలుతుందని, సుపరిపాలన స్వపరిపాలన అందించేందుకే సిపిఐ ఎం బిఆర్ఎస్ గద్వాన దండ కారుణ్య పార్టీ కూటమిగా ఏర్పడి స్థానిక సంస్థల బరిలో దిగుతున్నామని సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని చందర్రావు భవనంలో సిపిఐ ఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి బిఆర్ఎస్ కన్వీనర్ ఆకోజి సునీల్ కుమార్ ల అధ్యక్షతన జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018 నుండి నేటి వరకు గ్రామపంచాయతీలో పాలకవర్గం లేకపోవడం వల్ల అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పేదలు నివాసం ఉండే కాలనీలను గాలికి వదిలేసి సంపన్నుల ప్రాంతాల్లోనే అభివృద్ధి చేశారని ఆ అభివృద్ధిలో కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని పట్టణంలో అనేక కాలనీలలో సైడ్ డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లమీదకి చేరి దోమలు సైరవిహారం చేస్తున్నాయని ప్రజలు రోగాల బారిన పడుతున్న అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిజాయితీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత భద్రాచలం ప్రజలపై ఉందని ఏజే రమేష్ స్పష్టం చేశారు. ఆదర్శవంతమైన పాలన అందించేందుకు కూటమి సమర్థవంతమైన అభ్యర్థులను నిలబెడుతుందని ఈనెల 11వ తారీఖున జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామ స్వరాజానికి నాంది పలకాలని ఏజ రమేష్ పిలుపునిచ్చారు.

గద్వాన దండకారణ్య పార్టీ కన్వీనర్ శరత్ మాట్లాడుతూ భద్రాచలం పట్టణ సమస్యలపై పూర్తి అవగాహన ఉండి నిజాయితీగా అభివృద్ధి చేసే అభ్యర్థులను కూటమి తరపున నిలబెడుతున్నామని గద్వాన దండకారణ్యపార్టీ కన్వీనర్ గుండి శరత్. మూడు పార్టీలతో పాటు కలిసి వచ్చే సామాజిక ఆదివాసి సంఘాలను కలుపుకొని ఈ ఎన్నికల బరిలో దిగుతున్నామని కూటమి సర్పంచ్ అభ్యర్థి అయిన రామకృష్ణాని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సిపిఎం నాయకులు నర్సారెడ్డి మాట్లాడుతూ సిపిఐఎం బిఆర్ఎస్ జిడిపి కూటమి నిస్వార్థ నిజాయితీపరులను స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థిగా నిలబెడుతుందని ఏమాత్రం అవినీతి చరిత్ర లేని నిస్వార్థ అభ్యర్థులను గెలిపించి నిజాయితీ పాలనకు భద్రాచలం పట్టణ ప్రజలు స్వాగతం పలకాలని ఎం బి నర్సారెడ్డి పట్టణ ప్రజలను కోరారు. పాలకులు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని పంచాయతీలకు ఉండాల్సిన హక్కులను సైతం ఎమ్మెల్యేలు ఎంపీలు కాజేస్తున్నారని నర్సారెడ్డి ఆరోపించారు. అభివృద్ధి అంటే కేవలం సంపన్నులు ఉన్నచోటే కాదని పేదలు దళితులు బడుగు బలహీన వర్గాల నివాస ప్రాంతాలలో కూడా అభివృద్ధి చేస్తేనే సమగ్ర అభివృద్ధి అవుతుందని భద్రాచల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని నర్సారెడ్డి స్పష్టం చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో సిపిఐ ఎం జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు సున్నం గంగా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రమోద్ కుమార్ రామకృష్ణ జిడిపి పార్టీ నాయకులు గుండి ప్రదీప్ సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట రామారావు పారిల్లి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి టిఆర్ఎస్ మహిళా నాయకులు పూజల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram