బీజేపీ, టీడీపీ,జనసేన కూటమి అభ్యర్థిగా హరిచంద్ర నాయక్ ఎంపిక

భద్రాచలం టౌన్ : TODAY 9:

డిసెంబర్ 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో భద్రాచలం పంచాయతీ కూటమి అభ్యర్థిగా హరిచంద్ర నాయక్ ను బీజేపీ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని టీడీపీ, జనసేన పార్టీలు సైతం సమర్థించడంతో మూడు పార్టీల సంయుక్త అభ్యర్థిగా ఆయనను ఎంపిక చేసినట్లు నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా మూడు పార్టీల నాయకులు హరిచంద్ర నాయక్ ను అభినందించారు. అలాగే రేపు ఉదయం 10.30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమై, జూనియర్ కాలేజ్, అంబేద్కర్ సెంటర్ మీదుగా ఎండీఓ కార్యాలయం వరకు నామినేషన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నుండి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుంజా ధర్మారావు, పసుమర్తి సతీష్, ముత్యాల శ్రీనివాస్, టీడీపీ నుండి కొడాలి శ్రీనివాసరావు, కుంచాల రాజారామ్, కోనేరు రాము, చిట్టిబాబు, కంభంపాటి సురేష్, జనసేన పార్టీ నుండి బండి రాంప్రసాద్ తదితరులు పాల్గొని అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share