సైబర్ నేరగాళ్ల వలలోపడి మోసపోవద్దని, మీ డబ్బును డబుల్ చేసి చూపిస్తాం అని ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టాలని చూస్తే నమ్మి మోసపోవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తున్నా నిర్లక్ష్యంతో ఎందరో సైబర్ ఉచ్చులో పడి డబ్బు నష్టపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడానికి చెందిన ఒక వ్యక్తి ఈ విధంగానే కోట్లల్లో మోసపోయిన సంఘటన మరవకముందే, సరిగ్గా అలాంటి సంఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కు Hi అని మెసేజ్ పెట్టి ఆ డాక్టర్ నుండి ఏకంగా రూ.14 కోట్లు కాజేసిందో కిలాడి లేడీ. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్‌కు, ఆగస్టు 27వ తేదీన మౌనిక అనే పేరుతో ఫేస్ బుక్కులో మాయ లేడీ HI అని మెసేజ్ పెట్టింది.ఆ మెసేజ్ కు స్పందించిన డాక్టర్ తాను hi అంటూ జవాబు ఇచ్చాడు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ముదిరి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసుకునే స్థాయికి చేరుకున్న తరువాత, సైబర్ లేడీ డబ్బులు డబుల్ అవుతాయి ట్రేడ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టమని డాక్టర్‌కు సూచించింది.ఆమె మాటలు విని రూ.14 కోట్లు పెట్టిన కొన్ని రోజులకు, అకౌంట్లో రూ.34 కోట్లు ఉన్నట్లు గమనించి ఆనందపడిపోయిన డాక్టర్ డబ్బులు డ్రా చేద్దామంటే రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు









