కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  పోటీ చెయ్యి రాములమ్మా..నీ కాళ్లు మొక్కుతాం…!

గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడు అవసరం. ఏ నాయకుడైనా తన స్వార్థాన్ని చూసుకోకుండా ప్రాంత అభివృద్ధి పై దృష్టి సారిస్తేనే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రజా నాయకుడిగా ఉండాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. గ్రామస్థాయి నుండి దేశ రాజకీయాల వరకు చక్రం తిప్పాలనే ఆశ రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి సహజం. అందుకు భిన్నంగా ఇప్పుడు జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులే కరువు అవుతున్న పరిస్థితి రాజకీయ పార్టీలకు ఎదురవటం గమమనార్హం .

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఓ మహిళ కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో చోటు చేసుకుంది ఓ కాంగ్రెస్‌ అభిమాని ,మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి రాములమ్మను తమ పార్టీ మద్దతుదారుగా సర్పంచి అభ్యర్థిగా బరిలో నిలవాలని కాళ్లు పట్టుకొని విజ్ఞప్తి చేశారు. ఈ స్థానం బీసీ మహిళకు కేటాయించగా ఆమెను పోటీ చేయాలని కోరారు. కాళ్లు మొక్కుతూ చాలాసేపు బ్రతిమిలాడించుకున్న అనంతరం సర్పంచ్ గా పోటీ చేయడానికి ఆలోచించుకుని చెబుతామన్నారు ఆ మహిళ. ఈ సంఘటన చూసినవారు ఆశ్చర్యపోతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు