పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 15 రోజులేనా..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. కేవలం 15 రోజులే నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ భద్రత, ఢిల్లీ కాలుష్యం (AQI 272), ప్రజాస్వామ్యం, రాష్ట్రాల ఆర్థిక భద్రత తదితర కీలక అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

పార్లమెంటులో చర్చలు నిర్వహించడం బిజెపి ప్రభుత్వానికి ఇష్టం లేదని విమర్శించారు. ప్రజా భద్రతపై చర్చ జరగాల్సి ఉండగా,ఆ అంశాన్ని గాలికి వదిలేయడం తగదన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రకృతి విపత్తుల సహాయంపై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తామన్నారు. విపక్ష ఎంపీలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram