కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  బి జె పి సర్పంచ్ నామినేషన్ రిజెక్ట్ పై ఆందోళన.

భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో బీజేపీ, టీడీపీ, జనసేన మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్ నామినేషన్ రద్దుపై మూడు పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. నామినేషన్ దాఖలు సమయంలో ఐటీ రిటర్నులు, ఆస్తి వివరాలు సహా అవసరమైన అన్ని పత్రాలు సమర్పించామని, అధికారులు కూడా. అన్ని సరిగా ఉన్నాయనే స్పష్టంగా తెలియ జేశారని నాయకులు విలేకర్లు సమావేశం లొ తెలియజేసారు.మూడు విడతల్లో అధికారులను ఏమైనా లోపాలు ఉన్నాయా అని అడిగినా పూర్తిగా సరిగా ఉన్నాయని చెప్పిన తర్వాత, రాత్రి 8 గంటలకు అకస్మాత్తుగా మైక్ ద్వారా నామినేషన్ రిజెక్ట్ చేసినట్లు ప్రకటించారని వాపోయారు.ఈ అనూహ్య నిర్ణయంపై ఉన్నతాధికారులకు వెంటనే ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు.

తమ నామినేషన్ ని అధికారులు ఆమోదిస్తారనే నమ్మకం తమకు ఉందని బిజెపి సర్పంచ్ అభ్యర్థి హరిచంద్ర నాయక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుంజా ధర్మారావు, నాగబాబు. సతీష్. టీడీపీ నేతలు కొడాలి శ్రీనివాస్, కుంచాల రాజారామ్, తాళ్లూరి చిట్టిబాబు, అబ్బినేని శ్రీనివాస్. జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు