కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  నీట్ పేపర్ లీకుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం….

  • నీట్ పేపర్ లీకుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం.
  • 22 లక్షల మంది విద్యార్థులకు బిజెపి సమాధానం చెప్పాలి.
  • సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 12
టుడే 9 ప్రతినిధి

రాజస్థాన్ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ పేరుతో అధికారంలో ఉన్న బిజెపి నీట్ పరీక్ష పేపర్ ను లీక్ చేసి 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నారని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి విమర్శించారు. ఈనెల మూడో తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీటి పరీక్ష 22 లక్షల మంది విద్యార్థులు రాసారని అన్నారు. కేంద్రంలో రాజస్థాన్లో అధికారులు ఉన్న బిజెపి ఎన్డీఏ సర్కార్ నీట్ పేపర్లను లీక్ చేసి ఇప్పుడు అర్ధాంతంగా పరిష రద్దు చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. కేంద్రంలోబిజెపి అధికారం చేపట్టిన నాటినుండి అనేక రకాల 89 పరీక్ష పత్రాలు లీకైనవని నర్సారెడ్డి గుర్తు చేశారు. ప్రధానంగా బిజెపి పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ లోని అత్యధికంగా జాతీయ పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నాయని అన్నారు. బిజెపి చేస్తున్న లీక్ రాజకీయాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదివి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఇప్పుడు మోడీ ఏం సమాధానం చెబుతారని నర్సారెడ్డి ప్రశ్నించారు. నీట్ పరీక్షకు అత్యధికంగా పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఆశతో హాజరై తమ భవిష్యత్తుపై కలలు గంటన్న సమయంలో పేపర్ లీక్ పేరుతో రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్న బిజెపికి విద్యార్థులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పేపర్ లీకేజీ బిజెపి పాలిత రాష్ట్రంలోనే జరిగినప్పటికీ కేంద్ర కొనసాగిల్లోనే పనిచేసే సిబిఐ విచారణతో ఏ నిజాలు బయటకు వస్తాయని నర్సారెడ్డి ప్రశ్నించారు. సిపిఐ విచారణ ఇది కేవలం కంటి తరుపు చర్య తప్ప నిజమైన బాధ్యులను శిక్షించే ఉద్దేశం బిజెపి సర్కార్కు లేదని నరసారెడ్డి అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు నీట్ పరీక్ష పత్రాల లీకేజీ పై చర్యలు చేపట్టకపోతే సిపిఐఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో విద్యార్థిని విద్యార్థులు మనోవేదనకు గురి కావద్దని పట్టుదలతో మరోసారి పరీక్షకు హాజరై సత్తా చాటాలని నర్సారెడ్డి నీటి విద్యార్థులను కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు