టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) అంటేనే నందమూరి ఫ్యాన్స్‌కు ఒక పెద్ద పండగ. అయితే, ఈసారి ఆ పండగ హడావుడిని ఒకరోజు ముందే, అర్ధరాత్రే మొదలుపెట్టేందుకు సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘NTRNeel’ ఫస్ట్ గ్లింప్స్ టీజర్‌ను ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి (మిడ్‌నైట్) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ మెగా ప్రాజెక్ట్ గ్లింప్స్‌ను కేవలం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్‌ను టార్గెట్ చేస్తూ మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో భారీ ప్లాన్ సిద్ధం చేశారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ టీజర్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయబోతున్నారు. ఐదు భాషల్లో ఒకేసారి గ్లింప్స్ రానుండటంతో, నేషనల్ వైడ్‌గా ఈ సినిమా సృష్టించబోయే హైప్ మరియు అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇటీవలే ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన ఒక ఊరమాస్ స్టిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎడారి మధ్యలో ఒక వ్యక్తి చేతిలో కర్ర పట్టుకుని నిలబడి ఉన్న ఈ పోస్టర్, ప్రశాంత్ నీల్ సృష్టించబోయే కొత్త యాక్షన్ ప్రపంచం ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చింది. “The calm before the . Rest you know what to fill in the blank.” ( ముందు ప్రశాంతత… ఖాళీని మీరే పూరించండి) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఈ స్టిల్‌ను పంచుకోవడంతో అభిమానులు నెట్టింట రకరకాల అంచనాలతో చర్చలు మొదలుపెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ క్రేజ్ నెలకొంది.









