గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన…..

  • గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన.
  • ఐపిడిఏ ప్రాజెక్టు అధికారి. బి రాహుల్.
  • భద్రగిరి మార్ట్ సరుకులు అందజేత.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 16
టుడే 9 ప్రతినిధి

ఆదివాసి గిరిజన మహిళలు రైతులకు ఆర్థికంగా చేయూత అందించడానికి ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రారంభించిన భద్రగిరి మార్ట్ లోని సేంద్రియ న్యూట్రిషన్కు సంబంధించిన నిత్యవసర సరుకులు ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.

శుక్రవారం నాడు సాయంత్రం హైదరాబాదులోని సచివాలయంలో ఇతర మంత్రివర్యులతో కలిసి మహువ ఫ్లవర్ ప్రాజెక్ట్ అమలుపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరియు వర్క్ షాప్ లో పాల్గొన్న తెలంగాణలోని ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు.గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఐటీడీఏ పరిధిలోని ప్రతి గిరిజన గ్రామంలో ఇప్పపువ్వు సేకరణ నిలువ యూనిట్ల కోసం తీసుకోవలసిన కార్యాచరణ గురించి నిర్వహించిన వర్క్ షాపులో భద్రాచలం ఐటీడీఏ తరపున పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 70 ఎస్ఎస్సి గ్రూపు మహిళలు.ఆదివాసి గిరిజన మహిళలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఇప్పపువ్వు లడ్లు, వివిధ రకాల పచ్చళ్ళు, తృణధాన్యాలు, గిరిజన రైతుల నుండి సేకరిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులు, జిసిసి ద్వారా అటవీ ఉత్పత్తుల సేకరణ భద్రగిరి మార్ట్ కు సంబంధించిన నిత్యవసర సరుకులతో పాటు బుక్లెట్ ను మంత్రివర్యులకు అందించి భద్రగిరి మార్ట్ నిర్వహణ గురించి పూర్తిస్థాయిలో వివరించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ అడవులలో నివసించే ఆదివాసి గిరిజన మహిళలు, రైతులు, ఎస్ సి హెచ్ జి గ్రూప్ మహిళలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకొని మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న వాస్తవాలను గమనించి వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి భద్రాచలంలో భద్రగిరి మార్ట్ నెలకొల్పి వారు తయారు చేసిన నిత్యవసర సరుకులను మధ్య దళారుల పాలు కాకుండా కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించిన ఐటీడీఏ పీవో బి రాహుల్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణలోని ఐటిడిఏ పిఓలు, డిటిడిఓలు . ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు