గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు. … పాల్గొన్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి. బి రాహుల్…

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 18
టుడే 9 ప్రతినిధి

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రెటరీ శ్రీమతి సీతాలక్ష్మి ఆదేశాల మేరకు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గిరిజన గురుకుల విద్యాలయాల ఇంటర్మీడియట్ బాలికల మొదటి సంవత్సరం కౌన్సిలింగ్ పగడబందీగా నిర్వహించడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

సోమవారం నాడు భద్రాచలం పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల
బాలికల కళాశాలలో బాలికలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో వివిధ కళాశాలలకు అడ్మిషన్ కొరకు జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమొత్తం 576 సీట్ల గాను విద్యార్థినిలకు పదవ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ప్రకారము కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించి కౌన్సిలింగ్కు వచ్చిన విద్యార్థినిలందరికీ కళాశాలలో చేరడానికి సీట్లు భర్తీ చేయడం జరిగిందని అన్నారు.

కౌన్సిలింగ్ ప్రక్రియకు వచ్చిన విద్యార్థినిలు విద్యార్థినిల తల్లిదండ్రులతో మాట్లాడి గురుకుల కళాశాలలో సీట్లు దొరకడమే అదృష్టంగా భావించాలని ఏ సబ్జెక్టులో దొరికిన తప్పనిసరిగా అడ్మిషన్ పొందాలని అన్నారు.

అనంతరం 561 మార్కులు సాధించిన శ్రీజకు మొదటగా అడ్మిషన్ ఫారం అందించి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించి 395 మార్కుల వరకు వచ్చిన విద్యార్థినిలకు కళాశాలలో అడ్మిషన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ఎటువంటి అవకతవకలు జరగకుండా ఆర్సిఓ గురుకులం అరుణకుమారి ప్రిన్సిపాల్ ల పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగిందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, ఇతర కళాశాలల ప్రిన్సిపాల్ లు పుల్లమ్మ, రాణి, మాధవి లత, చైతన్య, ఇందిరా ప్రియదర్శిని మరియు గురుకులం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు