భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 18
టుడే 9 ప్రతినిధి
ఏజెన్సీ మారుమూల దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు జెన్ జాతీయ గరిమ ఉత్సవ్ 2026 ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ద్వారా విడుదలయ్యే సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందించడానికి జెన్ భాగీ దారి సబ్సే దూర్, సబ్సే పేహలే అనే నినాదంతో వివిధ శాఖల అధికారులు గిరిజనులను చైతన్య పరిచి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి మీ గ్రామాలకు వస్తున్నందున గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
సోమవారం నాడు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐటీడీఏ యూనిట్ అధికారులు మరియు గిరిజనుల సమక్షంలో జెన్ జాతీయ గరిమ ఉత్సవ్ 2026 జన్ భాగి దారి అభియాన్ సబ్సే దూర్ సబ్సే పహలే కార్యక్రమాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మారుమూల అటవీ ప్రాంతాలలో నివసించే గిరిజన కుటుంబాలు వారి ఆచారాలు, వారి జీవన శైలి, పద్ధతులు చాలా పురాతనంగా ఉంటాయని, ఆ గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాలు అందించడానికి గ్రామంలోనీ గిరిజన యువకులు మహిళల సహాయంతో గ్రామములో ఇంటింటికి మరియు పొలాల గట్ల వెంబట తిరిగి సమస్యలు తెలుసుకుని వారికి కావలసిన మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. గ్రామంలో ఆది సేవ కేంద్రాలలో ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించాలని, ముఖ్యంగా గిరిజన సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం, లవ్లీ వుడ్, ఫారెస్ట్ మంచినీరు, మేకల పెంపకం, మునగ చెట్ల సాగు, జీవిత బీమా, ఆది సురక్ష బీమా వంటి పథకాలు, జాబ్ కార్డ్స్, రేషన్ కార్డులు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు, ఓటర్ కార్డ్, బ్యాంకు అకౌంట్ల గురించి గిరిజనులకు తెలియజేసి అర్హులైన వారికి అక్కడే దరఖాస్తులు రాయించుకొని పరిష్కారం అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈనెల 18 నుండి 25 వరకు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం ఫోటో కవరేజ్ వీడియో కవరేజ్ తప్పనిసరిగా చేయాలని అన్నారు గిరిజనుల సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ప్రతి శాఖ అధికారి నిర్లక్ష్య వైఖరి కనబరచకుండా ప్రత్యేక శ్రద్ధతో అమలుచేసి ప్రతి ఒక్క గిరిజనులకు లబ్ధి చేకూరేలా కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ఏరియా పరిధిలోని 130 గ్రామాలు, ఖమ్మం జిల్లాలో 30 గ్రామాలలో అధికారులు ప్రత్యేకంగా ఇంటింటికి తిరిగి గ్రామములోని గిరిజనుల సమస్యలు తెలుసుకుని వారికి కావలసిన సంక్షేమ పథకాలు వివరాలు ప్రజల భాగస్వామ్యంతో సేకరించి ప్రతిపాదనలు తయారు చేస్తారని అన్నారు. అలాగే ఈ గ్రామాలలో ఈ రోజు నుండి 25వ తేదీ వరకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తారని అన్ని రకాల జబ్బులకు నిపుణులైన డాక్టర్ల చేత వైద్య పరీక్షలు చేయిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమాలకు సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ జిల్లా నోడల్ అధికారి గా వ్యవహరిస్తారని, అలాగే ఐటీడీఏ యూనిట్ అధికారులకు ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, ఆ మండల ఎంపీడీవోల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతున్నందున సంబంధిత ఎంపీడీవోలు మీ మండలంలోని వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకొని కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చూడాలని ఆయన కోరారు.
వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలు తప్పనిసరిగా డాక్యుమెంటేషన్ ఫోటోలు తీయించి ప్రత్యేకంగా తయారుచేసిన యాప్ లో ఐటిడిఏ కార్యాలయానికి మరియు జిల్లా నోడల్ అధికారికి పంపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని అశోక్, పి వి టి జి అధికారి గన్యా, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఏడిఎంహెచ్వో సైదులు, ఎస్ డి సి ఆనందకుమార్, ఏ పీ ఓ పవర్ వేణు, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏవో సున్నం రాంబాబు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.









