గూస్‌బంప్స్ తెప్పిస్తున్న మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ టీజర్.. దసరా బరిలో పాన్ ఇండియా మూవీ!

మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డేవిడ్ రెడ్డి’ అధికారిక టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో మనోజ్ అత్యంత శక్తివంతమైన టైటిల్ రోల్‌లో కనిపించబోతున్నారు. గతంలో విడుదలైన ‘వార్ డాగ్’ వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజాగా విడుదలైన టీజర్ ఆ హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రం కథాంశం 1897 నుండి 1920 మధ్య కాలంలో, అంటే బ్రిటిష్ పాలన నాటి చారిత్రాత్మక నేపథ్యంలో సాగుతుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని రాబోయే దసరా పండుగ సీజన్‌లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ టీజర్‌లో కేవలం యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, కథకు బలమైన హిస్టారికల్ ట్విస్టులను కూడా జోడించారు. డేవిడ్ రెడ్డి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సృష్టిస్తున్న సంచలనంపై అప్పట్లోనే జాతీయ నాయకులైన జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులు కూడా దృష్టి సారించినట్లు చూపించడం కథపై అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు దేశం కోసం పోరాడే డేవిడ్ రెడ్డి, ఆ తర్వాత కాలంలో ‘దేశద్రోహి’గా ఎందుకు ముద్ర వేయించుకోవాల్సి వచ్చింది? ప్రజలు అతన్ని ఎందుకు తప్పుబట్టారు? అనే ఉత్కంఠభరితమైన ప్రశ్నల చుట్టూ కథను తిప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీజర్‌లో డేవిడ్ రెడ్డి ఒంటరిగా 50 బెటాలియన్లకు చెందిన 2,000 మంది బ్రిటిష్ సైనికులతో తలపడే యాక్షన్ సీక్వెన్స్ రోమాంచితంగా సాగింది.

ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విదేశీ నటి మరియా ర్యాబోషప్కా కథానాయికగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, సముద్రఖని, అభయ్ డియోల్, కాంచన వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ పీరియాడిక్ సినిమా మంచు మనోజ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు