అనిరుధ్‌తో కావ్య మారన్ పెళ్లి?.. కోలీవుడ్‌లో హాట్ టాపిక్

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అధినేత్రి కావ్య మారన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మైదానంలో మ్యాచ్‌ల సందర్భంగా తన క్యూట్ హావభావాలతో నిరంతరం లైమ్‌లైట్‌లో ఉండే కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో ఆమె వివాహం జరగనుందనే వార్తలు ప్రస్తుతం కోలీవుడ్ సినీ వర్గాల్లో మరియు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

కావ్య మారన్, అనిరుధ్ మధ్య ప్రేమాయణం కొనసాగుతోందనే ప్రచారం సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. గతంలో కూడా వీరిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫోటోలు బయటకు రావడం, పెళ్లి చేసుకోబోతున్నారనే చర్చ నడవడం జరిగింది. అయితే అప్పట్లో అవన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయినప్పటికీ, ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కావ్య, అనిరుధ్ కుటుంబాల మధ్య వివాహానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అంతా అనుకూలిస్తే ఈ 2026 ఏడాది చివర్లోనే వీరిద్దరి వివాహం జరిగే అవకాశాలు ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది.

ఈ పెళ్లి వార్తల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు కూడా ప్రముఖంగా వినిపించడం విశేషం. అనిరుధ్ రవిచందర్ రజినీకాంత్ కుటుంబానికి అత్యంత సమీప బంధువు కావడంతో, ఈ సంబంధం విషయంలో రజినీకాంత్ స్వయంగా చొరవ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ తరపున రజినీకాంత్.. కావ్య మారన్ తండ్రి, సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్‌తో మాట్లాడినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, నెట్టింట ఈ వార్త ఎంతగా హల్‌చల్ చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఇటు మారన్ కుటుంబం నుండి కానీ, అటు అనిరుధ్ కుటుంబం నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు