కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  యూకేలో భారతీయులు నిర్వహిస్తున్న కంపెనీల సంఖ్య 1,912 – బ్రిటన్ ట్రాకర్ నివేదిక

యూకే మార్కెట్‌లో భారత కంపెనీల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే కంపెనీల సంఖ్య 60 శాతం మేర పెరిగింది. గ్రాంట్ థ్రాంటన్ యూకే సంస్థ ప్రచురించిన ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఈ నివేదిక ప్రకారం, ప్రస్తుతం యూకేలో భారతీయులు నిర్వహిస్తున్న కంపెనీల సంఖ్య 1,912కు పెరిగింది. ఏడాది క్రితం ఈ సంఖ్య 1,197గా ఉండేది. ఈ కంపెనీల మొత్తం టర్నోవర్ విలువ కూడా 72.14 బిలియన్ పౌండ్ల నుంచి 105.77 బిలియన్ పౌండ్లకు పెరిగింది. 2025లో భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్య 47.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11 శాతం అధికం.

గతేడాది ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. త్వరలో ఇది చట్టరూపం దాల్చనుంది. ఈ ఒప్పందం కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయని నివేదిక తేల్చింది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లు చేర్చేలా ఈ ఒప్పందం కుదిరింది.

ఈ నివేదిక ప్రకారం, బ్రిటన్‌లో భారతీయులకు చెందిన 66 కంపెనీల వార్షిక ఆదాయం 10 శాతం మేర పెరిగింది. యూకేలో ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ భారతీయ కంపెనీలు మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. వృద్ధి పథంలో దూసుకుపోతున్న కంపెనీల్లో ప్రైమ్ ఫోకస్ ఇంటర్నేషనల్ సర్వీసు, జైడస్ ఫార్మాసిటుకల్స్ యూకే సంస్థలు ముందు వరుసలో నిలిచాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు