2047 వరకు మోదీయే ప్రధానిగా కొనసాగాలి: బండి సంజయ్

భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారని, దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును ఆయన బద్దలు కొట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన అరుదైన రికార్డు మోదీ పేరిట లిఖించబడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

రాబోయే 2047 సంవత్సరం వరకూ నరేంద్ర మోదీయే దేశ ప్రధానిగా కొనసాగాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ప్రధాని తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు శరవేగంగా పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారత్‌ను ‘విశ్వగురు’ స్థానంలో నిలబెట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో, కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఆ వివాదం పూర్తిగా కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) పరిధిలోని అంశమని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, చట్టప్రకారం ఈసీనే దానిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు