భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. జూన్ 16
టుడే 9ప్రతినిధి
భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఆదేశానుసారం సర్ ప్రక్రియ ఈ నెల 24 నుండి ప్రారంభమవుతున్నందున సంబంధిత బిఎల్వోలు బిఎల్ఓ సూపర్వైజర్లు చేపట్టవలసిన కార్యాచరణ పై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భద్రాచలం తహసిల్దార్ తోట రవికుమార్ అన్నారు.
మంగళవారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భద్రాచలం మండలంలోని 44 మంది బిఎల్వోలు బిఎల్ఓ సూపర్వైజర్లకు సర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఏ విధంగా నమోదు చేయాలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24 నుండి సర్ ప్రక్రియ ప్రారంభమవుతున్నందున సంబంధిత బిఎల్వోలు మీ పరిధిలోని అర్హులైన ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి ఇనుమరేషన్ ఫారం అందించి అట్టి ఫారం తప్పనిసరిగా తప్పులు లేకుండా ప్రతి ఒక్కరి ఓటర్లకు సంబంధించిన ఆధారాలు పూరించిన తర్వాత ఎన్యుమరేషన్ ఫారం తీసుకోవాలని ఈ నమోదు ప్రక్రియ ఒక నెల రోజులలో పూర్తి చేయాలని బిఎల్వోలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం డిటి ధనియాల వెంకటేశ్వర్లు . బిఎల్వోలు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.









