“తొలిముద్ద” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప సర్పంచ్ నిట్టా శిరీష
D రమేష్, Today9 News ప్రతినిధి, మణుగూరు
పినపాక మండలంలోని భూపాలపట్నం అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తొలిముద్ద” కార్యక్రమాన్ని ఉప సర్పంచ్ నిట్టా శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తొలిముద్ద కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రాలలో ఉదయం అల్పాహారాన్ని అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 3 సంవత్సరముల నుంచి 6 సంవత్సరముల చిన్నారులలో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడానికి ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేశారు. చిన్నారుల తల్లిదండ్రులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సుజాత, ఆశా కార్యకర్త నీలమ్మ, చిన్నారుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.









