రాత్రివేళల్లోనూ తక్షణ స్పందన… విధి పట్ల నిబద్ధత చాటిన మణుగూరు కరెంటు సిబ్బంది
D రమేష్, Today9News ప్రతినిధి, మణుగూరు
మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం: పట్టణంలోని సుందరయ్య నగర్లో గత కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో పలుమార్లు కరెంటు అంతరాయం ఏర్పడింది. అయితే సమస్య తలెత్తిన వెంటనే కరెంటు సిబ్బంది అప్రమత్తమై సకాలంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసినా వెంటనే స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశారు.
సుందరయ్య నగర్లో నడిరాత్రి ఏర్పడిన కరెంటు అంతరాయం సమాచారం అందిన వెంటనే లైన్ ఇన్స్పెక్టర్ మాధవరావు, అసిస్టెంట్ లైన్మెన్ కాసిం, ఎల్లయ్యతో పాటు ఇతర కరెంటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నిరంతరంగా పనిచేసి సమస్యను పరిష్కరించారు.
ఇంతటి ఓపికతో, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్న కరెంటు సిబ్బంది సేవలను సుందరయ్య నగర్ వాసులు ప్రశంసించారు. వారి తక్షణ స్పందన, వృత్తి నైపుణ్యం నిజంగా అభినందనీయమని అన్నారు.
ప్రజలకు రాత్రివేళల్లో కూడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ మాధవరావు, విద్యుత్ శాఖ సిబ్బందికి సుందరయ్య నగర్ ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు.









