కొత్తగూడెం చేరుకున్న డిజిపి సివి ఆనంద్.. స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.

కొత్తగూడెం చేరుకున్న డిజిపి సివి ఆనంద్.. స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

D రమేష్, Today 9News ప్రతినిధి, మణుగూరు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనలో భాగంగా కొత్తగూడెం విచ్చేసిన డిజిపి సివి ఆనంద్ కు  జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.స్వాగతం  పలికారు
నేడు భద్రాచలం లో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్, పాల్వంచ నూతన డిపిఓ భవనం , ఏఆర్ డి ఎస్పి క్వార్టర్స్, ఏ ఆర్ హెడ్ క్వాటర్స్ , పోలీస్ గెస్ట్ హౌస్ ను ప్రారంభించనున్నారు. అనంతరం ఖమ్మంలో నేర సమీక్ష సమావేశం లో పాల్గొననున్నారు.

జిల్లాల పర్యటనలో భాగంగా ఈ రోజు డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్  అంకిత్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ, రోహిత్ రాజ్ ఐపీఎస్ స్వాగతం పలికారు.

జిల్లాలో పోలీస్ శాఖ సన్నద్ధత, మౌలిక వసతులు, నేర నియంత్రణ చర్యలు, అంతర్శాఖ సమన్వయంపై సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మణుగూరు పోలీస్ స్టేషన్, పాల్వంచ నూతన డీపీఓ భవనం, ఏఆర్ డీఎస్పీ క్వార్టర్స్, ఏఆర్ హెడ్క్వార్టర్స్, పోలీస్ గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవాలతో పాటు జిల్లా అధికారులతో నేర సమీక్ష సమావేశంలో పాల్గొని అనంతరం ఖమ్మం జిల్లాకు బయలుదేరనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు