ఒమాన్‌ పర్యటనకు ఇరాన్ విదేశాంగ మంత్రి: హోర్ముజ్ జలసంధి భద్రతపై కీలక చర్చలు….

హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మరియు నౌకాయాన భద్రతపై కీలక చర్చలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి ఒమాన్‌కు పయనం కానున్నారు. గత ఒకటి రెండు నెలలుగా ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా కొనసాగుతున్న సంప్రదింపులలో భాగంగానే ఈ పర్యటన జరగనుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయిని ఉటంకిస్తూ అక్కడి అధికారిక వార్తా సంస్థ ‘ఐఆర్‌ఎన్‌ఏ’ (IRNA) వెల్లడించింది. వ్యూహాత్మక జలమార్గ రక్షణకు సంబంధించి ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రాంతీయంగా ఈ జలసంధి వాషింగ్టన్ (అమెరికా) మరియు టెహ్రాన్ (ఇరాన్) మధ్య సుదీర్ఘకాలంగా ఒక ప్రధాన వివాదాస్పద అంశంగా మారింది. గతంలో అమెరికా, ఇజ్రాయెల్ వైఖరికి ప్రతిస్పందనగా టెహ్రాన్ ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఆ తర్వాత దౌత్యపరమైన కాల్పుల విరమణ ఒప్పందాలతో తాత్కాలికంగా విరామం లభించినప్పటికీ, అప్పటి నుండి ఈ జలమార్గం చుట్టూ ఏదో ఒక రూపంలో ఉద్రిక్తతలు మరియు అడపాదడపా హింసాత్మక ఘటనలు తలెత్తుతూనే ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఐదవ వంతు చమురు మరియు ద్రవీకృత సహజ వాయువు (LNG) రవాణాకు ఈ జలసంధి అత్యంత కీలకమైన మార్గం కావడంతో, దీనిపై పూర్తి నియంత్రణ సాధించాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకలపై ప్రత్యేక రుసుములు వసూలు చేయాలనే ప్రతిపాదనను కూడా టెహ్రాన్ తెరపైకి తెచ్చింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ జలసంధిలో ఒమన్, ఇరాన్‌ల ప్రాదేశిక జలాలు ఉన్నప్పటికీ, సాధారణంగా ఓడల రాకపోకలను నిరోధించడానికి లేదా అదనపు సుంకాలు విధించడానికి ఎటువంటి వీలులేదు. ఈ నేపథ్యంలో ఒమాన్ పర్యటనలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు