సీతమ్మసాగర్ ప్రాజెక్టు పరిశీలనకు  రానున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

సీతమ్మసాగర్ ప్రాజెక్టు పరిశీలనకు  రానున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

*ముందస్తు ఏర్పాట్లలో భాగంగా , హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన అధికారులు

Today9News, ప్రతినిధి D రమేష్, మణుగూరు

అశ్వాపురం మండలంలోని మొండికుంట క్రీడా ప్రాంగణం సమీపంలో త్వరలో జరగనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

సీతమ్మసాగర్ ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌కు అనువైన స్థలాన్ని రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖల అధికారులు స్థానిక సర్పంచ్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

హెలిప్యాడ్ నిర్మాణానికి అవసరమైన భద్రతా ప్రమాణాలు, రాకపోకల సౌకర్యం, వాహనాల పార్కింగ్, అధికారుల బందోబస్తు ఏర్పాట్లపై సమగ్రంగా పరిశీలించి సంబంధిత శాఖలకు తగిన సూచనలు చేశారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన విజయవంతంగా నిర్వహించి, సీతమ్మసాగర్ ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు