ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు .కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జ్. జాన్సన్ నాయక్, CCI సాధన సమితి నాయకులు ఉన్నారు.
అదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేయనున్నారు.సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నారు.









