దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు 

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం : జూలై 16, D వినేష్ భద్రాచలం డివిజన్ ప్రతినిధి..

భద్రాచలం గర్ల్స్ హైస్కూల్లో విద్యాశాఖ – సమగ్ర శిక్ష, తెలంగాణ  ALIMCO సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు  మాట్లాడుతూ, దివ్యాంగ విద్యార్థులు విద్యలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని అన్నారు. వారికి అవసరమైన సౌకర్యాలు, సహాయక ఉపకరణాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్యతోనే దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, పడిసిరి శ్రీనివాస్, పిలక వెంకటరమణరెడ్డి, వార్డు సభ్యులు బొంత రమణ, బండారు శరత్, ఇనుముల అశోక్, ఇర్ఫా అనసూయ, యూత్ నాయకులు ఎడారి ప్రదీప్, గాడి విజయ్, ఆకుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు