భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు , పాయం వెంకటేశ్వర్లు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు , పాయం వెంకటేశ్వర్లు

భద్రాచలం, జూలై 19: D వినేష్ భద్రాద్రి డివిజన్ ప్రతినిధి..

 

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ & సమాచార శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ,పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో కలిసి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. , రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సస్యశ్యామలంగా ఉండాలని శ్రీ సీతారాముల వారిని మంత్రి ప్రార్థించారు.

అనంతరం ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, భద్రాచలం సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ), జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ), దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యూత్ నాయకులు‌ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు