సింగరేణి విశ్రాంత ఉద్యోగస్తులు కార్పొరేట్ వైద్యం కోసం ఎదురుచూపులు
Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
సింగరేణి సంస్థలో విధులు నిర్వర్తించి రిటైర్ అయిన విశ్రాంత ఉద్యోగుల కార్పొరేట్ వైద్యానికి 8 లక్షలు చెల్లిస్తుండగా ఆ ఖర్చును భార్యాభర్తలకు ఇద్దరికీ కలిపి 15 లక్షలకు పెంచే విషయంలో ఇచ్చిన హామీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందా అని ఎదురుచూస్తున్న అరోగ్య (CPRMS) కార్డు కలిగిన విశ్రాంత ఉద్యోగులు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.
విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య భీమా చెల్లింపులను, భార్యాభర్తలకు ఇద్దరు కలిపి 15 లక్షలు మంజూరు చేయవలసిందిగా విన్నవించుకోవడంతో, సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి సాధ్యసాద్యాలను పరిశీలించి కార్పొరేట్ వైద్యానికి 15 లక్షలు పెంచేందుకు హామీని ఇవ్వడం జరిగిందని . ఆ హామీ కార్యరూపం ఎప్పుడు పొందుతుందా అని, గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ఉపముఖ్యమంత్రి తీపి కబురు ప్రకటిస్తారని వ్యక్తం చేస్తున్నారు..
ఆరు జిల్లాల సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరీక్షణకు 15 లక్షలు ఇవ్వబోతున్నారనే, ఊహాగానాలపై సరైన నిర్ణయం తీసుకొని వృద్దాప్యంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మాజీ ఉద్యోగుల ఆరోగ్య భవితవ్యం ఉపముఖ్యమంత్రి ప్రకటన పై ఆధారపడి ఉందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి…









