విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ… ఎమ్మెల్యే

విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

ప్రతి రైతు కుటుంబానికి నేనున్నా.. ప్రజల వద్దకే పాలన మా ప్రభుత్వ లక్ష్యం – వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

 

23(TODAY 9):

 

వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ప్రజల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజల అడుగుజాడల్లో నడుస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వైరా నియోజకవర్గంలోని ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలుస్తానని, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తాను వారి వెంట ఉంటానని హామీ ఇచ్చారు.

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ ఘటనను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగానికి పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులు. వారి గొంతును అణిచివేయడం దేశ భవిష్యత్తుపై దాడి చేసినట్లేనని అభిప్రాయపడ్డారుఎమ్మెల్యే, విద్యార్థుల సమస్యలను వినాల్సిన ప్రభుత్వాలు, వారిపై లాఠీలు ఎత్తడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కాలరాయడం సమంజసం కాదన్నారు.

ప్రశ్నించే స్వరాలను అణచివేయడం కాదు… సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ బాధ్యత.”

రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లడమే మా ప్రభుత్వ నిబద్ధత. ప్రతి రైతు కుటుంబానికి తాను అండగా ఉంటానన్నారు ఎమ్మెల్యే.
ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వైరా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషిని కొనసాగిస్తానని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు